హీరో నిఖిల్ తన అప్కమింగ్ ప్రాజెక్టులపై క్రేజీ అప్డేట్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం చేస్తున్న ‘స్వయంభు’తో పాటు, రామ్ చరణ్ నిర్మాణంలో ‘ఇండియా హౌస్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు వెల్లడించాడు. వీటితో పాటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కార్తికేయ-3’ కూడా లైన్లో ఉందని చెప్పి అభిమానుల్లో జోష్ నింపాడు.