»Delhi Liquor Scam Supreme Court Refuses To Grant Interim Relief To Kavitha Over Ed Summons
Delhi excise policy case: అలా చేయమంటూనే… కోర్టు తలుపు తట్టిన కవిత, షాకిచ్చిన సుప్రీం
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ఈడీ నోటీసులపై (ED notices) న్యాయ పోరాటానికి (Supreme Court) దిగారు. తనకు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గడపను తొక్కారు. అయితే మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ఈడీ నోటీసులపై (ED notices) న్యాయ పోరాటానికి (Supreme Court) దిగారు. తనకు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గడపను తొక్కారు. అయితే మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీనిని ఈ నెల 24వ తేదీన విచారిస్తామని స్పష్టం చేసింది. దీంతో కవిత రేపు మరోసారి ఈడీ విచారణకు (Ed investigation) హాజరు కావాల్సిందే. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia), కవిత సన్నిహితులు అరుణ్ రామచంద్ర పిళ్లై (arun ramachandran pillai) సహా పలువురు అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కవితను కూడా ఈడీ ఇప్పటికే ఓసారి (మార్చి 11న) 9 గంటల పాటు విచారించింది. రేపు మరోసారి విచారించనుంది. ఇంతలో ఆమె కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టులో ఊరట దక్కలేదు. దీంతో గురువారం విచారణకు వెళ్లవలసి ఉంటుంది.
మంత్రి కేటీఆర్, కవిత సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు తాము ఇతర నాయకుల్లో భయపడమని, తాము చేతకాని దద్దమ్మల్లా స్టే కోసం కోర్టుకు వెళ్లమని, ఈడీ నోటీసులను ధైర్యంగా ఎదుర్కొని, విచారణకు హాజరవుతామని చెప్పారు. కానీ అంతలోనే కవిత మధ్యంతర రిలీఫ్ కోసం కోర్టును ఆశ్రయించడం గమనార్హం.
ఈడీ విచారణ (ED investigation), మహిళా రిజర్వేషన్ బిల్లు (women reservation bill) సహా వివిధ అంశాల కోసం ఇప్పటికే కవిత ఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం (BJP Government) అన్నింటా విఫలమైందని ఆరోపించారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు (women reservation bill) ఆమోదం తెలపాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఏర్పాటు చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి సగం మంది ఎంపీలు హాజరవుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.