మొలకెత్తిన గింజలు పోషకాల గని. వీటిని నిత్యం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం తగ్గుతుంది. ఇవి మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని పోషకాలు నరాల వ్యవస్థను, మెదడు పనితీరును మెరుగుపరిచి శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యానికి మొలకలు ఉత్తమ ఆహారం.