KRNL: టమాటా రైతుకు ఈ ఏడాది కష్టకాలం దాపురించింది. ఆరు గాలం కష్టపడి పండించిన పంటకు మార్కెట్లో గిట్టు బాటు ధర లేక పొలంలోనే వదిలేసే దుస్థితి ఎదురైంది. పెద్దకడబూరు మం. రంగాపురానికి చెందిన నాగరాజు ఎకరా పొలంలో టమాటా సాగు చేశారు. ఇప్పటివరకు రూ.40 వేలకు పైన పెట్టుబడి పెట్టారు. పంట చేతికొచ్చింది. ప్రస్తుతం కిలో రూ.2 – రూ.3 ఉండటంతో రోడ్లపై పడేశారు.