దసరాతో మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చిరంజీవితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ నేను ఎదిగాను. మెగాస్టార్ చిరంజీవిని మరింత కొత్తగా చూపించడానికి మేమెంతో వేచి చూస్తున్నాం. నా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఆ కల సాకారం కాబోతోంది’ అంటూ పోస్ట్ చేశారు.