భారీ బడ్జెట్తో తెరకెక్కిన కంగువా సినిమా అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది. కంగువా దెబ్బ నుంచి కోలుకున్న సూర్య.. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన 44వ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సూర్య 45వ సినిమా తెలుగులో ఫ్లాప్ అయిన వీర సినిమా స్టోరీని కాస్త అటు ఇటు మార్చి బాలాజీ సూర్య తెరకెక్కిస్తున్నారని చెప్పడంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. స్టోరీలో భారీ మార్పులు చేస్తే తప్ప హిట్ అయ్యే అవకాశం లేదంటున్నారు.