మెగా హీరో వరుణ్ తేజ్ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న వరుణ్ తేజ్‌కు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వరుణ్ తేజ్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం తర్వాత స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందని వరుణ్ తేజ్ పేర్కొన్నారు.