12TH ఫెయిల్ సినిమా హీరో విక్రాంత్ మాస్సే నటనకు విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. దీనిపై బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా స్పందించారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ధైర్యం కావాలన్నారు. గతంలో ఇలా విరామం ప్రకటించిన కొందరు నటులు, దర్శకులు తిరిగి కెరీర్ను ప్రారంభించి విజయాలను అందుకున్నారని గుర్తుచేశారు.