స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల గాయపడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ గాయం గురించి చెప్పింది. అక్టోబర్ 5న ఉదయం జిమ్‌కు వెళ్లాను. అక్కడ 80 కేజీలు లిఫ్ట్ చేశాను, అప్పుడు వెన్నులో నొప్పి స్టార్ట్ అయింది. తరువాత 4రోజులు జిమ్‌కు గ్యాప్ ఇచ్చి షూటింగ్‌కి వెళ్లాను ఇంటికి తిరిగి వచ్చాక నొప్పి తీవ్రం అయింది. ఉన్నట్లుండి స్పృహ కోల్పోవడంతో ఇంట్లోవాళ్లు ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పింది.