దర్శకుడు ఆర్జీవీ అరెస్ట్ అవుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఆర్జీవీ.. ఒకవేళ తనని అరెస్టు చేస్తే జైలుకు వెళ్తానని, అక్కడ ఖైదీలతో స్నేహం చేసి నాలుగు సినిమా కథలు రాసుకుంటానని అన్నారు. అయితే తన అరెస్ట్ విషయంలో మీడియా అత్యుత్సాహం చూపడంపై అసహనం వ్యక్తం చేశారు.