కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. భార్యభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు ఆమె ఇంటి చుట్టుపక్కల వాళ్ల స్టేట్ మెంట్లను రికార్డు చేశారు. కాగా, ఆమె ఇంట్లో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘అంతా బాగానే ఉంది. చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్’ అని రాసి ఉంది.