పుష్ప-2 సినిమా ఈ నెల 5న విడుదలవుతున్న నేపథ్యంలో.. ప్రీ సేల్లో రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడవుతున్నాయి. ఓవర్సీర్లో హవా చూపిన ఈ చిత్రం.. తాజాగా ఉత్తరాదిన కూడా సత్తా చాటుతోంది. హిందీ వెర్షన్లో టికెట్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లో లక్ష టికెట్స్ సేల్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ చిత్రాల లిస్టులో మూడో స్థానంలో నిలిచింది. ప్రీ సేల్ బుకింగ్స్ లోనే రూ.60కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.