మెగా ప్రిన్స్ వరున్ తేజ్ నటించిన ‘మట్కా’ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. అయితే తరువాతి సినిమా మంచి డైరెక్టర్‌తో తీసేందుకు సిద్ధమవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా దర్శకుడు మేర్లపాక గాంధీతో జతకట్టనున్నాడట. ఈ సారి సీరియస్ యాక్షన్ మూవీ కాకుండా హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్నాడట. కాగా ఈ మూవీ షూటింగ్ 2025 మార్చిలో ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది.