ఆత్మహత్యకు పాల్పడిన కన్నడ నటి శోభిత కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తెలుగు, కన్నడ సీరియళ్లు, పలు సినిమాల్లో నటించిన శోభితకు గతేడాది HYDకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంది. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవటంతో అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇవాళ ఉస్మానియా ఆస్పత్రిలో శోభిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.