BDK: కరకగూడెం మండలం వట్టం వారి గుంపు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న మెనూ, భోజన నాణ్యత, వసతి సౌకర్యాలు, పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు.