సత్యసాయి: ధర్మవరం పట్టణం 8వ వార్డు కేశవనగర్కు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఉదయ్ కుమార్కు మంత్రి సత్యకుమార్ ప్రత్యేక చొరవతో రూ.10,000 పెన్షన్ మంజూరైంది. నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు శనివారం ఉదయ్ కుమార్కు పెన్షన్ మొత్తాన్ని స్వయంగా అందజేశారు. కష్టకాలంలో ఆదుకున్న మంత్రికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.