HNK: ఇంటర్ ఫలితాల్లో 997 మార్కులు సాధించిన తీగల సాయి శ్రేష్టితను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సన్మానించారు. చదువు మన తలరాతను మారుస్తుందని, రాబోయే రోజుల్లో మరింత కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని, తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పాల్గొన్నారు.