JBL: సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం మహాదేవపురం మండలం కాళేశ్వరం పర్యటనలో స్టోన్ క్లాడింగ్, పార్కింగ్ టైల్స్, మ్యూజియం నిర్మాణాలను పరిశీలించారు.పనుల వేగం పెంచడంతో పాటు నాణ్యతలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. గడువులోగా పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలి.