కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నేత వరుపుల రాజా శనివారం తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. పార్టీ నేత మృతి పైన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నేత వరుపుల రాజా శనివారం తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. పార్టీ నేత మృతి పైన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొబ్బిలి, సాలూరు నియోజక వర్గాల ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు ఆయన. కొద్ది రోజులుగా ప్రచారంలో పాల్గొని, శనివారం ప్రత్తిపాడు తన ఇంటికి వచ్చారు. ప్రతి శ్రేణులతో రాత్రి 8 గంటలు దాటే వరకు మాట్లాడారు.
ఆ తర్వాత గుండెపోటు రావడంతో హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. రాత్రి 11.30 గంటలకు మృతి చెందారు. తాము బ్రతికించేందుకు శాయశక్తులా కృషి చేశామని కానీ ఫలితం లేకుండా పోయిందని వైద్యులు ప్రకటించారు. గుండెపోటుతో రాజా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.