BPT: పొన్నూరులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శాసనసభ్యుడు మరియు సంఘం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆదేశాల మేరకు 28వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు షేక్ కరిముల్లా బాజీ, పట్టణ సీనియర్ నాయకుడు వి. లక్ష్మణమూర్తి, సచివాలయం నోడల్ ఆఫీసర్ తులసి, దివ్యరాణి పాల్గొన్నారు.