PLD: బెల్లంకొండ మండలం చండ్రాజ్ పాలెం గ్రామంలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి 12 ఏళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పసివాడి మృతితో స్థానికంగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.