NZB: సిరికొండ మండలంలోని పెద్ద వాల్గోట్, సిరికొండ, గడ్కోల్, రామడుగు గ్రామాల్లో ఇనుప స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. వర్షాకాలంలో ఇనుప స్తంభాలతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇనుప స్తంభాలు తొలగించాలని విద్యుత్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇనుప స్తంభాలు తొలగించి సిమెంట్ స్తంభాలు వేయించాలని స్థానికులు కోరుతున్నారు.