HNK: కమలాపురం మండలం ఉప్పల్‌ను స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని సర్పంచ్ మొండెద్దుల రమనాగరాజు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా “స్వచ్ఛ గ్రామం–సురక్షితమైన గాలి, నీరు” కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ప్రధాన వీధుల్లో శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. మురుగు కాలువల్లోని చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, తొలగించి గ్రామాన్ని శుభ్రం చేశారు.