ASR: కొయ్యూరు MRO పీ.మురళీబాబు బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న MRO ప్రసాద్ 5నెలల కిందట గుండెపోటుతో మృతి చెందారు. దీంతో మురళీబాబును ఇక్కడ నియమించారు. ఈ క్రమంలో ఆయనను కలెక్టరేట్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్లో ఏవోగా పనిచేస్తున్న ప్రసాదరావును కొయ్యూరు తహశీల్దార్‌గా నియమించారు. త్వరలో ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు.