SKLM: ఈ నెల 8న ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పీఎం అప్రెంటీస్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఐటీఐ కన్వీనర్ ఎల్.సుధాకర రావు గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో పలు ప్రముఖ పరిశ్రమలు పాల్గొంటారని పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరోజు ఉదయం 9 కు బయో డేటాతో పాటు ఆధార్ కార్డు, మూడు పాస్ ఫోటోలతో హాజరుకావాలన్నారు.