VZM: పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు నాటి సంరక్షించాలని గ్రీన్ బెల్ట్ అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని బొబ్బిలి కోటి చెరువు గట్టుపై మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిరక్షణకు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు పాల్గొన్నారు.