JN: విద్యా సంస్థల 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ హెచ్చరించారు. ముఖ్యంగా మైనర్లకు విక్రయిస్తే జైలు శిక్ష తప్పదన్నారు. చిన్నారుల ఆరోగ్యం మనందరి బాధ్యతని, నిబంధనలు ఉల్లంఘిస్తే కోట్‌పై (COTPA)-2003, జువైనల్ జస్టిస్ యాక్ట్-2015 కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.