శ్రీకాకుళంలోని ప్రజలకు సరఫరా చేసే తాగునీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ తాగునీటి సరఫరా, సచివాలయాల పరిధిలోని మౌలిక వసతుల కల్పనపై మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.