AP: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. నిన్న రాత్రి ఆయన తిరుపతి చేరుకున్నారు. తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకోనున్నారు. తిరుమలలో ఓ కార్యక్రమంలో భాగంగా పీయూష్ మొక్కలు నాటనున్నారు. పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాత ప్రత్యేక విమానంలో విశాఖకు వెళ్లి సమావేశంలో పాల్గొంటారు.