NLG: ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. నిన్న నల్గొండ డిపోను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బస్టాండ్ ప్రాంగణంతో పాటు డిపో పరిసరాలను ఆర్ఎం జానిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి బస్సు నడిపేలా కృషి చేయాలన్నారు.