TG: వచ్చే 9 నెలల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తి చేసి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు కృష్ణా జలాలు చేరాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. భూసేకరణ కోసం నెలకు రూ.500 కోట్లు విడుదల చేస్తామని, ఈ బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. అలాగే ప్రతిపాదిత లక్ష్మీదేవిపల్లి జలాశయ నిర్మాణానికి భూసేకరణ చేపట్టాలని సూచించారు.