ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా ఎంజీకేఎల్ఎలో భాగమైన ఎల్లూరు, నార్లాపూర్, ఏదులు, వట్టెం, కరివెన, ఉదండాపూర్‌లోని ఆయ చోట్ల నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లు, పంప్ హౌస్‌లు పరిశీలించనున్నారు. చివరగా జడ్చర్ల బహిరంగ సభతో ముగియనుంది.