KMM: ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా గ్రామసభలు ఉపయోగపడుతున్నాయని ఖమ్మం మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. గురువారం ఖమ్మం 1, 3, 4, 7, 9, 11, 12, 14, 16, 17, 19, 22, 24, 25, 28 డివిజన్లో వార్డు సభలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ సభల్లో ప్రజల నుంచి సమస్యలతో కూడిన వినతి పత్రాలను స్వీకరించామని తెలిపారు. సమస్యలను సకాలంలో పరిష్కరిస్తామన్నారు.