NDL: బనగానపల్లె నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 25,566 ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఆయన స్పందించారు.