NRPT: మరికల్ మండల పరిధిలోని జిన్నారం, మాధ్వార్, మరికల్, ఎలిగండ్ల ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను నూతనంగా ప్రారంభించనున్న ప్రీ-ప్రైమరీ స్కూళ్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాలుగా పని చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి మీర్జా కలీముల్లా సూచించారు.