దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో రానున్న భారీ చిత్రం ‘వారణాసి’ గురించి ప్రియాంక చోప్రా ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇందులో తను ‘మందాకిని’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా తన సినీ ప్రయాణాన్ని మార్చేస్తుందని, తన కెరీర్ను నిర్వచించే చిత్రమిదని ఆమె పేర్కొంది.