TPT: బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ మనవరాలు చిరంజీవి కుప్పాల దర్శన పేరుతో ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షలు విరాళాన్ని అందజేశారు. ఇవాళ ఉదయం తిరుమల అడిషనల్ ఈవో ఛాంబర్లో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళ డీడీని దాత అందజేశారు. అనంతరం దాత కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులను అదనపు ఈవో అభినందించారు.