KNRL: దేవనకొండ మండలం గుడిమిరాళ్ల గ్రామంలో పిడుగు పడి గొల్ల పక్కీరప్ప పెద్ద కుమారుడు రాముడు (57) మృతి చెందాడు. గొర్రెల మంద వద్ద ఉన్న రాముడిపై అకస్మాత్తుగా పిడుగు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనను ఎవరూ గమనించలేదు. గురువారం ఉదయం తోటి గొర్రెల కాపరులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.