శ్రీసత్యసాయి: జిల్లాలో గురువారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో 91.6 మి.మీ మొత్తం వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 2.9 మిసమీగా రికార్డైంది. మొత్తం 32 మండలాలకు గాను 10 మండలాల్లో వర్షం కురిసింది. చిలమత్తూరులో అత్యధికంగా 28.6 మి.మీ, గోరంట్లలో 24.2 మిమీ, లేపాక్షిలో 10.4 మిమీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.