హనుమకొండ పట్టణ కేంద్రంలోని ములుగు రోడ్డు ప్రభుత్వ ITI కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్యామల తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, PG పూర్తిచేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల లోపు సంబంధిత విద్య అర్హత పత్రాలతో అర్హులు జాబ్ మేళాకు హాజరుకావాలని ఆమె సూచించారు.