MHBD: కేసముద్రం మండల కేంద్రంలో సహాయ వ్యవసాయ సంచాలకులు అజ్మీర శ్రీనివాసరావు, ఏవో బి. వెంకన్నతో కలిసి పలు విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. పత్తి విత్తనాల స్టాక్ రిజిస్టర్లు, ఇన్వాయిసులు, సోర్స్ సర్టిఫికెట్లు పరిశీలించారు. రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని డీలర్లకు సూచించారు. అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.