NLR: వలేటి వారి పాలెం మండలం మాలకొండలోని శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ఈనెల 5వ తేదీన కొండపై ఉన్న కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేవాదాయ ధర్మదాయ శాఖ పరివేక్షణలో కార్యక్రమం జరుగుతుందన్నారు. దేవస్థాన సిబ్బంది హాజరు కావాలన్నారు.