MDCL: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై దాడి జరిగింది. ఇందిరానగర్‌కు చెందిన మంద సాయి కుమార్ (26) తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి బయటకు వస్తుండగా, చిలుకానగర్‌కు చెందిన జాన్, పవన్ సహా మరికొందరితో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి గొడవగా మారడంతో జాన్ బ్లేడ్‌తో సాయి కుమార్ మెడపై దాడి చేసినట్లు సమాచారం.