అన్నమయ్య: నందలూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఉదయం 10.30 గంటలకు దివ్యాంగులకు బస్ పాసులను పంపిణీ చేయనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు జంగంశెట్టి సుబ్బయ్య తెలిపారు. రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్రాజు పాసులను అందజేస్తారని చెప్పారు. అర్హులైన దివ్యాంగులు హాజరై పాసులను పొందాలని సూచించారు. అవసరమైన ధ్రువపత్రాలతో రావాలని సూచించారు.