MLG: జిల్లాలోని అన్ని గ్రామాల్లో గురువారం నుంచి గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ బొర్కే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ సభలు జరుగుతాయని, అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పక పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఆయన సూచించారు.