KMM: హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రియదర్శని ఇంజనీరింగ్ కాలేజ్‌లో ‘అరైవ్ అలైవ్’ రహదారి భద్రత ప్రచారం నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ సాధ్యమన్నారు. పొగమంచు సమయంలో లో-భీమ్ లైట్లు, సురక్షిత దూరం పాటించాలని తెలిపారు.