సత్యసాయి: సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లి–మంచేపల్లి రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచేపల్లి గ్రామానికి చెందిన రైతు బోయ అంజి మృతి చెందాడు. ఆయన పశువులకు గడ్డి తీసుకెళ్తూ బైక్పై వెళ్తుండగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా పడగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.