BPT: లైన్ల నిర్వహణ పనుల కారణంగా గురువారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు బాపట్ల పట్టణంలో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ సాయి శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని రైల్వే స్టేషన్, డీఎస్పీ కార్యాలయం, పాత బస్టాండ్, విలియం బుత్ కాలేజ్, కొట్ర బజార్, దర్శి పెద్ద మస్తాన్ నగర్, రథం బజార్ పరిసర ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.