KDP: రాజమండ్రి 45వ వార్డు రామాలయం సమీపంలోని రేషన్ షాప్ నెంబర్ 93పై బుధవారం భారీ చెట్టు కూలింది. భవనం దెబ్బతినే ప్రమాదం ఉండటంతో అధికారులు ముందస్తుగా దుకాణానికి తాళం వేశారు. సరుకులు తీసుకునేందుకు వచ్చే వినియోగదారులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఆ చెట్టును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.