AKP: రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని కొయ్యూరు ఏవో పీ. శివరామ్ ప్రసాద్ రైతులకు సూచించారు. ఖేత్ బచావో అభియాన్-2026లో భాగంగా బుధవారం రామన్నపాలెంలో భూమిని కాపాడుదాం, రైతును బలోపేతం చేద్దాం కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్ తరాల కోసం భూమిని కాపాడుకోవాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా భూమికి అవసరమైన ఎరువులను మాత్రమే వాడాలని సూచించారు.